Pages

Friday, 30 October 2015

IT'S A ATM VIRUS.

ATM మెషీన్‌లోంచి డబ్బు దానంతట అది వచ్చేస్తే? ఇంతకాలం ATMలను బద్ధలు కొట్టో, విప్పదీసో దొంగతనం చేయడానికి ట్రై చేసే దొంగల్ని చూశాం. ఇప్పుడు Tyupkin అనే వైరస్‌ని ATM మెషీన్లకి ఇన్‌ఫెక్ట్ చేస్తే చాలు అది డబ్బుని బయటకు పంపుతుంది. ATM మెషీన్ల వెనుక ఉండే బ్యాక్ ప్యానెల్‌ని తొలగించి పెన్‌డ్రైవ్‌ని గుచ్చి, ఆ పెన్ ‌డ్రైవ్‌లో ఉండే వైరస్‌ని ఇన్‌ఫెక్ట్ చేస్తే చాలు, ఆ వైరస్ ట్రిగ్గర్ అయ్యే విధంగా ATM మెషీన్ నెంబర్ పాడ్ మీద ఒకటి రెండు కీస్ట్రోక్‌లను ఇస్తే చాలు.. ఆటోమేటిక్‌గా డబ్బు వచ్చేస్తుంది. రష్యాకి చెందిన 19 ఏళ్ల కుర్రాడు తయారు చేసిన ఈ వైరస్ గురించి ప్రపంచవ్యాప్తంగా ATMలను తయారు చేస్తున్న NCR Corp. హెచ్చరించింది. తాజాగా సూరత్‌లో ఇలా ATM మెషీన్లని ఇన్‌ఫెక్ట్ చెయ్యడం ద్వారా డబ్బు దొంగతనం చేసే ఉదంతం బయటపడింది. ATM మెషీన్లలోని Firewallని ఛేధించుకుని రిమోట్ లొకేషన్ నుండి ఈ వైరస్‌ని జొప్పించగలిగితే పెన్ డ్రైవ్‌లతో పనిలేకుండా నేరుగా దొంగలు దొంగతనం చేసేయగలుగుతారు. బ్యాంకులు ATM మెషీన్ల సెక్యూరిటీపై జాగ్రత్తలు తీసుకోవలసి ఉంది. ఇటీవల పరిశీలనలో గమనించిన దాని ప్రకారం చాలా బ్యాంకుల ATMలలో Windows XP ఆపరేటింగ్ సిస్టమ్‌ మాత్రమే వాడబడుతోంది.

No comments:

Post a Comment